రాష్ట్రాభివృద్ధే మా ఇద్ద‌రి ఆశ‌యం: క‌మ‌ల్‌

KAMAL HASSAN ,RAJANIKANTH
KAMAL HASSAN ,RAJANIKANTH

చెన్నైః తనది, ‘సూపర్‌స్టార్’ రజనీకాంత్‌ది ఒకే ఆశయమని అంటున్నారు విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌. గురువారం చెన్నై విమానాశ్రయంలో మీడియా వర్గాలు కమల్‌ను రజనీ గురించి ప్రశ్నించాయి. దీనికి కమల్‌ హాసన్‌ స్పందిస్తూ.. తమిళనాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మా ఇద్ద‌రి ఆశయమని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని సమస్యలు పరిష్కరించడానికి కేవలం మాటలు సరిపోవని పేర్కొన్నారు.
రజనీ చెప్పినట్లు రాష్ట్రంలో ఆధ్యాత్మిక రాజకీయాలు సాధ్యం అవుతాయో లేదో తెలీదు కానీ తాను మాత్రం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటున్నట్లు చెప్పారు. తన కార్యకర్తలను సంప్రదించి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 21న పార్టీ వివరాలు వెల్లడిస్తానన్నారు. జాతీయ రాజకీయాల కంటే తనకు తన రాష్ట్రమే ముఖ్యమని తెలిపారు.