రాష్ట్రానికి అమెరికా పెట్టుబడులు

AP MINISTER LOKESH
AP MINISTER LOKESH

రాష్ట్రానికి అమెరికా పెట్టుబడులు

మంత్రి లోకేష్‌కు హామీ ఇచ్చిన ప ఎన్‌ఆర్‌ఐ పారిశ్రామివేత్తలు
లాస్‌ఏంజల్స్‌, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో పలు కంపెనీల అధిపతులతో భేటీ

విజయవాడ సిటీ: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా వున్నామని అమెరికాలో పర్యటి స్తున్న మంత్రి నారా లోకేష్‌కు పలు కంపెనీల సిఇఒలు హామీ ఇస్తున్నారు. లాస్‌ ఏంజల్స్‌లో పర్యటిస్తున్న మంత్రి లోకేష్‌ హాస్పటల్‌ మేనేజ్‌మెంట్‌, హెల్త్‌ సర్వీసెస్‌లో వున్న ఎలక్టో హెల్త్‌కేర్‌ సంస్థ సిఇఒ లక్ష్మణ్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ రెడ్డి ఎపిలో అమలు చేస్తున్న రాయితీలు, విధానాలను తెలుసుకున్నామని, త్వరలో ఎపిలో తమ సంస్థ లను, కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మెడ్‌టెక్‌ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి లోకేష్‌ అన్నారు. మెడికల్‌ పరికరాల తయారీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నామని వెల్లడించారు. మెడికల్‌ కంపెనీల స్థాపనకు ముందుకొచ్చే వారికి పలు రాయితీలిస్తున్నామని, పూర్తి సహకారం అందిస్తామన్నారు. తక్షణం కంపెనీ ప్రారంభిస్తాం: సిస్‌ ఇంటెలి సిఇఒ హెల్త్‌కేర్‌ ఆటోమేషన్‌, ఐఓటి, డేటా అనలిటిక్స్‌, క్లౌడ్‌, డిజైన్‌, డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ అందిస్తున్న సిస్‌ ఇంటెలి సంస్థను ఎపిలో ప్రారంభిస్తామని సిస్‌ ఇంటెలి సిఇఒ రవి హనుమార మంత్రి లోకేష్‌కు హామీఇచ్చారు.