రాబ‌ర్ట్ వాద్రాపై ఛీటింగ్ కేసు న‌మోదు

Robert Vadra
Robert Vadra

యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై చీటింగ్, ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. హర్యానాలోని ఖేర్కి దౌలా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. గురుగ్రామ్ భూముల లావాదేవీలకు సంబంధించిన ఈ కేసులో రాబర్ట్ వాద్రాతో పాటు హర్యానా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ హుడాపైనా కేసు నమోదైంది. కాగ్రా, రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా జరిగిన భూ లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మేవాత్ నివాసి సురేంద్ర శర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.