రాఫెల్‌పై రేపు సుప్రీంలో విచారణ

SUPREME COURT
SUPREME COURT

న్యూఢిల్లీ: మోదీ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టిన వివాదాస్పదమైన రాఫెల్ ఒప్పందంపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యం విచారణను సుప్రీం కోర్టు బుధవారం నుంచి విచారణ చేపట్టనుంది. భారత్ ఫ్రాన్స్‌ల మధ్య కుదిరిన ఒప్పందం.. యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు ఖరారు చేసుకున్న యుద్ధ విమానాల ధరాల్లో వ్యత్యాస వివరాలను సీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ వినీత్ అనే న్యాయవాది ఈ పిల్ దాఖలు చేశారు. డస్సాల్ట్ సంస్థ రిలయన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వివరాలను సయితం బయట పెట్టాలని ఆయన కోరారు.