రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారం

MINISTERS OATH
MINISTERS OATH

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌-జేడిఎస్‌లు మంత్రివర్గాన్ని విస్తరించారు. కర్ణాటకలో మంత్రుల ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది. ముందుగా అనుకున్న ప్రకారం కాంగ్రెస్‌కు 22, జేడిఎస్‌కు 12 మందికి మంత్రి పదవులు అని అంగీకారానికి వచ్చారు. కాని కాంగ్రెస్‌ నుంచి 14 మంది ప్రమాణం, జేడిఎస్‌ నుంచి 7 గురి ప్రమాణ స్వీకారం చేశారు. బీఎస్పీ, కేజిపి ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. నూతన మంత్రుల చేత గవర్నర్‌ వాజుభా§్‌ు వాలా రాజ్‌ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్‌కు హోం శాఖ, జేడిఎస్‌కు ఆర్ధిక శాఖ కేటాయించారు. డి కే శివకుమార్‌కు ఇరిగేషన్‌, వైద్యవిద్య కేటాయించారు. ఏకైక బిఎస్పీ ఎమ్మెల్యేకు కేబినెట్‌లో చోటు కల్పించారు.