రాజ్‌నాథ్‌కు నివేదిక పంపిన కేసరినాథ్‌

Rajnath singh
Rajnath singh

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై ఆ రాష్ట్ర గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి నివేదికను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు పంపినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. బెంగాల్‌ వ్యవహారంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్లో మాట్లాడిన అనంతరం ఈ నివేదిక పంపించారు. శారదా కుంభకోణం దర్యాప్తు నేపథ్యంలో కోల్‌కత్తా పోలీస్‌ కమీషర్‌ రాజీవ్‌ కుమార్‌ను విచారించేందుకు వెళ్లిన సిబిఐ అదికారులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నిర్బంధించడంపై పూర్తి వివరాలు తెలసుకోవాలని రాజ్‌నాథ్‌ బెంగాల్‌ గవర్నర్‌కు సూచించారు.