యాపిల్‌ సంస్థకు భారీ జరిమానా

Apple
Apple

సిడ్నీ: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ యాపిల్‌పై ఆస్ట్రేలియాలోని కోర్టు భారీ జరిమానా విధించింది. కొనుగోలుదారుల హక్కులకు సంబంధించి యాపిల్‌ తప్పుడు వాదనలు వినిపించిందని న్యాయస్థానం తెలిపింది. ఐఫోన్లు,ఐపాడ్లను మూడవ పార్టీ రిపేర్‌ తర్వాత యాపిల్‌ రిపేర్‌ చేసేందుకు అంగీకరించడంలేదని కోర్టు వెల్లడించింది. దీంతో కోర్టు యాపిల్‌ సంస్థకు 6.7 మిలియన్ల అమెరికా డాలర్లు(9 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లు)జరిమాన విధించింది. యాపిల్‌ కొనుగోలుదారులు కన్జూమర్స్‌ కమిషన్‌లో ఫిర్యాదు చేయగా కోర్టు విచారించింది. ఆపరేషన్‌ సిస్టమ్‌లో సమస్య రావడంతో వినియోగదారులు కోర్టును ఆశ్రయించారు. దీనికి సమాధానంగా తమ ఉత్పత్తులను వేరే కంపెనీ రిపేర్‌ చేసిన తర్వాత తమ సర్వీస్‌ని పొందే అర్హత కొల్పోతారని యాపిల్‌ సంస్థ వెల్లడించింది.