యడ్యూరప్ప కీలక నిర్ణయం

Yeddyurappa
Yeddyurappa

బెంగుళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి సీనియర్‌ నేత, మాజీ సియం యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రెండో కుమారుడు విజయేంద్ర.. వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదని మైసూర్‌లో జరిగిన పార్టీ బహిరంగ సభలో యడ్యూరప్ప ప్రకటించారు. ఈ స్థానం నుంచి పార్టీకి చెందిన మరో కార్యకర్త పోటీ చేస్తారని ఆయన తెలిపారు. విజయేంద్రను ఎన్నికల బరిలో తప్పించే విషయంపై పార్టీ హైకమాండ్‌తో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.