మ‌హిళ‌ల‌కు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలుండాలిః క‌విత‌

KAVITA
KAVITA

హైద‌రాబాద్ః నగరంలోని పార్క్‌హయత్‌లో నల్సార్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మహిళా లీడర్‌షిప్ సమ్మిట్ -2108 జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యత పెరగాలన్నారు. మహిళలకు నాయకత్వ లక్షణాలు ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ హబ్‌ను ప్రారంభించామని తెలిపారు. వీ హబ్‌కు బడ్జెట్‌లో రూ. 15 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా షీటీమ్స్ అద్భుతంగా పని చేస్తున్నాయని ప్రశంసించారు.