మ‌మ‌తా బెన‌ర్జీని క‌లిసిన క‌మ‌ల్

mamathaa and kamal
mamathaa and kamal

కోల్‌కతా: సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ శుక్ర‌వారం ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీని క‌లుసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ద్య‌ రాజకీయాల‌ ప్రస్తావన వచ్చిందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. రాజకీయాలపై మరింత అవగాహన పెంచుకునేందుకు నింరతరం రాజకీయ నేతలతో, మేథావులతో సంప్రందింపులు జరుపుతూ దీర్ఘకాలక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు కమల్ ఇటీవల ప్రకటించారు. ఇందుకు ఎంత సమయం పట్టినా తొందరపడేది లేదని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కమల్ భేటీ అయ్యారు. తాజాగా, ఆయన కలుసుకున్న మూడవ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కావడం విశేషం.