మ్యూజియంలో మైనపు బొమ్మ

MAHESH BABU1
MAHESH BABU1

మ్యూజియంలో మైనపు బొమ్మ

భరత్‌ అనే నేను సినిమాతో రికార్డుల భరతం పడుతున్న టాలీవుడ్‌ సూపర్‌స్టార మహేష్‌బాబు మరో అరుదైన ఘనత సాధించబోతున్నారు.. ప్రఖ్యాత మడామే మ్యూజియంలో మషేష్‌ మైనపు విగ్రహాన్ని పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ ఘనతను బాహుబలి ప్రభాస్‌ దక్కించుకోగా, అతని తర్వాత ఆ ఘనత మహేష్‌బాబుకే దక్కింది.. అతి త్వరలో బ్యాంకాక్‌ లోని మడామే టూసాడ్స్‌లో మహేష్‌ మైనపు బొమ్మ కన్పించబోతోందన్నమాట.. మ్యూజియం నుంచి కొందరు సాంకేతిక నిపుణులు హైదరాబాద్‌కు వచ్చి మరీ మహేష్‌ శరీర కొలతలు తీసుకెళ్లారు. ఈసందర్భంగా మహేష్‌ తన ట్వీట్టర్‌ ఖాతాలో అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నారు.. ప్రతిష్టాత్మక మడామే మ్యూజియంలో చోటు దక్కటం సూపర్‌ సంతోషంగా ఉందన్నారు. నా కొలతలు తీసుకునేందుకు వచ్చిన మ్యూజియం అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ..ఇంక్రిడెబల్‌ు.. గత ఏడాది ఇదే మ్యూజియంలో చోటు దక్కించుకున్నాడు బాహుబలి ప్రభాస.. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం కారణంగా రెబల్‌స్టార్‌కు ఈ ఘనత దక్కితే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటించిన భరత్‌ అనేనేను సినిమాతో కలెక్షన్లు కల్లగొడుతున్న మహేష్‌బాబుకి ఈ ఘనత దక్కటం చాలా ప్రత్యేకమైన విషయం.