మౌనదీక్షకు మద్దతు

Pawan Kalyan
Pawan Kalyan

మౌనదీక్షకు మద్దతు

విశాఖ: విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా డిమాండ్‌తో మౌనదీక్ష చేపట్టారు.. ఆంధ్రా యువత పేరుతో చేపట్టిన మౌనదీక్షకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మద్దతె తెలిపారు. అలాగే వైకాపా, వామపక్షాలు, కాంగ్రెస్‌, విద్యార్థి సంఘాలు మౌనదీక్షకు మద్దతు తెలిపాయి.. విశాఖ వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు.. బీచ్‌రోడ్డుపై పోలీసుల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.. బీచ్‌కు వచ్చే దారులన్నీ మూసివేశారు.. పోలీసుల, ఆర్కేబీచ్‌ వైపు ఎవ్వరినీ అనుమతించటం లేదు. బీచ్‌కు వచ్చే అన్ని మార్గాల్లో పోలీసులు భారీగా మోహరించారు.