మోదీ పొత్తు ధర్మాన్ని విస్మరించారు: సీఎం చంద్రబాబు

Chandrababu naidu
Chandrababu naidu

అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 25పార్లమెంట్‌ సభ్యుల సీట్లు గెలిపించండని, ప్రధాని ఎవరో మనమే తేలుద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ధర్మపోరాటదీక్ష విరమణ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పూర్తి మెజారిటీ ఉండటం వల్లే మోదీ పొత్తు ధర్మాన్ని విస్మరించారని ఆయన చెప్పారు. వ్యక్తిగత అజెండాతో పనిచేసే పార్టీలను దూరం పెట్టాలని చంద్రబాబు తెలిపారు. ధర్మ పోరాట దీక్ష స్ఫూర్తిదాయకంగా సాగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపారని చంద్రబాబు తెలిపారు.