మోది, అమిత్‌షాలపై పరువు నష్టం దావా

siddha ramaiah
siddha ramaiah

బెంగళూరు: భారత ప్రధాని నరేంద్రమోదికి, బిజెపి అద్యక్షుడు అమిత్‌షాలకు కర్ణాటక సియం సిద్దరామయ్య లీగల్‌ నోటీసులు పంపారు. తనపై అవినీతి ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం దావా ఎందుకు వేయకూడదో తెలపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కావాలంటే వాళ్లు పేపర్‌ చూసుకుని చర్చలో మాట్లాడవచ్చని తాను ఏ పేపర్‌ లేకుండా మాట్లాడతానని అన్నారు.