మేఘాలయ: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన పార్టీకే మద్దతు

UDP
UDP

మేఘాలయలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన పార్టీకే తాము మద్దతు ఇస్తామని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ పార్టీ (యుడిపి) నేతలు చెప్పారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే వారికి మద్దతు ఇస్తామని, అదే తమ తొలి ప్రధాన్యతాంశమని యుడిపి అధ్యక్షుడు దొనుకూపర్‌ రాయ్‌ చెప్పారు. యుడిపి సమావేశంలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై చర్చించనున్నారు. మేఘాలయలో యుడిపి ఆరు స్థానాల్లో విజయం సాధించింది.