మూడో ఫ్రంట్‌ దిశగా కెసిఆర్‌ మరో అడుగు

TS CM KCR
TS CM KCR

మూడో ఫ్రంట్‌ దిశగా కెసిఆర్‌ మరో అడుగు

నేడు చెన్నైకి పయనం..డిఎంకె నేత స్టాలిన్‌తో భేటీ
2న యుపి మాజీ సిఎం అఖిలేష్‌ యాదవ్‌తో.. తదుపరి ఒడిశా సిఎంతో కెసిఆర్‌ మంతనాలు

హైదరాబాద్‌,: థర్డ్‌ ఫ్రంట్‌ కోసం ముఖ్యమంతి కేసిఆర్‌ వడివడిగా అడుగులు వేస్తోన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయ త్నాలను ఆయన ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయం 10 గంట లకు బేగంపేట విమనాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన చెన్నై బయలుదేరుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం డిఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌తో కేసిఆర్‌ భేటీ అవుతారు. తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటుపై డిఎంకే నేతలతో చర్చిస్తారు. కేసిఆర్‌తోపాటు టిఆర్‌ఎస్‌ సెక్రెటరీ జనరల్‌ కే. కేశవరావు, ఇతర సీనియర్‌ నేతలు చెన్నై వెళ్ల నున్నారు. రాత్రికి అక్కడే బస చేసి సోమవారం మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌ కేసిఆర్‌ చేరుకుంటారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన కేసిఆర్‌ ఇటీ వల పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేడిఎస్‌ అధినేత దేవెగౌడ, ఝార్ఖండ్‌ మాజీ సిఎం హేమంత్‌ సోరెన్‌లతో వేర్వేరుగా సమావేశమైన విషయం తెలిసిందే. త్వరలో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్య మంత్రి అఃలేష్‌ యాదవ్‌, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో కేసిఆర్‌ సమావేశమై..మంతనాలు చేయనున్నారు. ఈ భేటీల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ లక్ష్యాలు.. కార్యాచరణ, ఎజెండా ఇతర అంశాలపై ఆయా నేత లతో కేసిఆర్‌ చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన టిఆర్‌ఎస్‌ 17వ ప్లీనరీలో జాతీయ రాజకీయాల్లో టిఆర్‌ఎస్‌ ప్రవేశంపై తీర్మానం పెట్టి చర్చించి.. ప్రతినిధుల అమోదం పొందారు. ఈ రాజకీయ తీర్మానం ఆమోదం పొందిన వెంటనే ‘దేశ్‌కీ నేతా..కేసిఆర్‌.. కేసి ఆర్‌జీ ఆప్‌ ఆగే బడో..హమ్‌ తుమ్‌కే సాథ్‌హై.. అంటూ నినాదాలతో ప్లీనరీ మార్మోగి పోయింది. తద్వారా తాను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశానికి నాయ కుల రాష్ట్ర నేతల మద్దతును కూడా కేసిఆర్‌ కూడగట్టారు. ఇక పక్షి లాగా దేశమంతా తిరిగి ఆయా రాాష్ట్రాలోని ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకం చేసి.. కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా కూటమిని ఏర్పా టు చేయడానికి కృషి చేస్తానని ఈసందర్బంగా కేసిఆర్‌ మరోసారి పునారుద్ఘటించారు. దేశంలో 70 వేల టిఎంసిల నీరు పుష్కలంగా ఉందని..దీనితో 40 కోటిఎకరాల భూమిని సస్యశామలం చేయవచ్చని ఆయన ప్రతిపాదించారు. ఇక నీటి యుద్దాలకు రాష్ట్రాల మధ్య తావు లేకుండా చేయవచ్చని సూచించారు. రాష్ట్ర అంశాలపై కూడా కేంద్ర పెత్తనం ఏమిటని ఆయన ప్రశ్నించారు.