మూడు వన్డేల సిరీస్‌ మిథాలీసేనకే…

women team india
women team india

మౌంట్‌మాంగను§్‌ు: మిథాలీ సేన కూడా కోహ్లి సేన బాట పట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే గెలుచుకుంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్స్‌ స్మృతి మంధాన, మిథాలీ రాజ్‌ హాఫ్‌ సెంచరీలతో చెలరేగడంతో 162 పరుగుల లక్ష్యాన్ని మరో 14.4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది టీమిండియా. ఈ మ్యాచ్‌లోనూ స్మృతి 90 పరుగులు చేసింది. అంతకుముందు టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించి కివీస్‌ను 161 పరుగులకే కట్టడి చేశారు. పేస్‌ బౌలర్‌ ఝలన్‌ గోస్వామి మూడు వికెట్లు తీయగా, ఏక్తా, బిస్త్‌,పూనమ్‌ యాదవ్‌, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు తీశారు. న్యూజిలాండ్‌ జట్టులో సాటెర్త్‌వేట్‌ మాత్రమే 71 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.