ముస్లిం మ‌హిళ‌ల‌కు మ‌రింత అన్యాయం

Asadudhin owaisi
Asadudhin owaisi
ముస్లిం మ‌హిళ‌ల జీవితాను రోడ్డున ప‌డేస్తోన్న ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును విస్తృత చర్చ తరువాత‌ మూజువాణి ఓటుతో లోక్‌స‌భ ఆమోదించిన విష‌యం తెలిసిందే. లోక్‌స‌భ‌లో ఈ బిల్లును తీవ్రంగా వ్య‌తిరేకించిన హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత‌ అస‌దుద్దీన్ ఒవైసీ.. ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ఉల్లంఘించేలా ఈ బిల్ ఉంద‌ని అన్నారు. లోక్‌స‌భ వాయిదా ప‌డిన అనంత‌రం అస‌దుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ… ట్రిపుల్ త‌లాక్‌ను నిరోధించే ఈ బిల్లు ముస్లింల‌కు న్యాయం చేయ‌లేద‌ని చెప్పుకొచ్చారు. అంతేగాక‌, ముస్లిం మ‌హిళ‌ల‌కు మ‌రింత అన్యాయం జ‌రుగుతుంద‌ని వ్యాఖ్యానించారు.