ముగిసిన ఏపి కేబినెట్‌, నిర్ణయాలివే…

AP CABINET
AP CABINET

అమరావతి: ఏపి రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ఈరోజు ఉదయం జరిగింది. ఈసందర్భంగా ఆయా విషయాలపై కేబినెట్‌ సుదీర్ఘంగా చర్చించింది. అంతేకాక పలు నిర్ణయాలను కూడా తీసుకుంది. ఏపి వ్యవసాయ మండలి ఏర్పాటుతోపాటు డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, సిమ్ కార్డుతోపాటు మూడేళ్ల పాటు కనెక్టివిటి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే అమరావతిలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు 30 ఎకరాలు కేటాయింపు, ఎకరాకు రూ.10 లక్షల చొప్పున 30 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయించారు. కాగా.. తొలి విడత రూ. కోటి సీఆర్డీఏకు చెల్లిస్తే సొసైటీకి భూమి బదలాయించేలా నిర్ణయించారు. మిగతా మొత్తం రెండేళ్లలో సీఆర్డీఏకి చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. అలాగే ఎన్జీఓలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ.. చదరవు గజం రూ.4 వేల చొప్పున 230 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది.