ముంబైనుంచి ఢిల్లికి అత్యంత వేగంగా నూతన రాజధాని ఎక్స్‌ప్రెస్‌

Mumbai toDelhi in12 hrs
Mumbai toDelhi in12 hrs

ముంబై: ముంబైనుంచి ఢిల్లికి అత్యంత వేగంగా ప్రయాణించే నూతన రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను త్వరలో ప్రవేశపెట్టనున్నారు. ఈ రైలు బంద్రా రైల్వేస్టేషన్‌నుంచి హజరత్‌ నిజాముద్దీన్‌ చేరడానికి 13 గంటలు మాత్రమే పడుతుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లి మార్గంలో రెండు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో ప్రయాణ సమయం 15 గంటలు పడుతోంది. కొత్త రైలు వల్ల రెండు గంటల ప్రయాణ సమయం తగ్గిపోతుందని అధికారులు చెప్పారు. దీపావళినుంచి కొత్త రైలు అందుబాటులోకి వచ్చే అవకాశముందని వారన్నారు.