మీడియాపై విరుచుకుపడ్డ ట్రంప్‌

Donald Trump
Donald Trump

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరో మారు ఆ దేశ మీడియాపై విరుచుకుపడ్డారు. జర్నలిస్టులు దేశభక్తి లేనివారన్నారు. తమ రిపోర్టింగ్‌ శైలితో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ట్రంప్‌ ఆరోపించారు. తాజాగా తన ట్విట్టర ద్వారా స్పందించిన ట్రంప్‌..జర్నలిస్టులు విధేయత కోల్పోయారన్నారు. పత్రికా స్వేచ్ఛ అంటే వార్తలను బాధ్యతాయుతంగా రిపోర్టు చేయాలని కానీ మీడియా అలా వ్యవహరించడం లేదని ట్రంప్‌ అన్నారు. ప్రభుత్వ ఆంతరంగిక విషయాలను రిపోర్టు చేసిన మీడియాపై ట్రంప్‌ ఫైర్‌ అయ్యారు.