మార్గ‌నిర్దేశం చేయండిః చంద్ర‌బాబుకు ఐఏఎస్ శిక్ష‌ణ సంస్థ ఆహ్వానం

AP CM Chandrababu Naidu
AP CM Chandrababu Naidu

అమ‌రావ‌తిః ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 25న ముస్సోరి వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు అఖిల భారత సర్వీసుల
శిక్షణా సంస్థ నుంచి ఆహ్వానం అందింది. శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించాలని, వారికి మార్గ
నిర్దేశం చేయాలని బాబును ఆహ్వానించారు. ఈ వివరాలను ఏపీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు
ఈనెల 25న ముస్సోరికి వెళుతున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీలోని పాలనా సంస్కరణలపై ఐఏఎస్ లతో
చంద్రబాబు మాట్లాడనున్నారు. ఇన్-సర్వీస్ ఐఏఎస్ లు, శిక్షణలో ఉన్న ఐఏఎస్ లతో జాయింట్ సెషన్లో చంద్రబాబు పాల్గొంటారని
అధికారులు తెలిపారు.