మాటలు బాగానే నేర్చేసింది..

ACTRESS  TAMANNA-1
ACTRESS TAMANNA

 మాటలు బాగానే నేర్చేసింది..

దక్షిణాదిలో వెలిగే ఉత్తరాది భామలు, మరీ ముఖ్యంగా బహుభాషా నటీమణులుఏప్రాంతానికి వెళితే అక్కడి వారిని పొగుడుతూ ఉంటారు..ఇలాంటి వాఖ్యలు ఏమైనా వివాదాస్పదమైతే మాత్రం తాను అలా అనలేదని అంటుంటారు.. మీడియా సృష్టేఅని కొట్టిపారేస్తారు.. ఇపుడు ఈ కోవలోకి మిల్కీబ్యూటీ కూడ వెళ్లిదనిస్తోంది. బాహుబలిలో ఓ వెలుగు వెలిగింది.

అయితే బాహుబలి 2లో మాత్రం కేవలం కొన్ని సెకన్లపాత్రకు పరిమితమైంది.. ఆ తర్వాత దక్షిణాదిలో కూడ అవకాశాలు బాగా తగ్గాయి.. దీంతో ముంబై వెళ్లి ఇక్కడి చిత్రాలలోనే నటిస్తానని , దక్షిణాది చిత్రాల్లో మంచి పాత్రలు వస్తేనే చేసే విషయం ఆలోచిస్తానని చెప్పింది.. దీంతో కొంతమేర అవకాశాలు తగ్గాయని అంటున్నారు.. అయితే సరిదిద్దుకునే ప్రయత్నంలో పడిందని దక్షిణాదికి వచ్చిన ఈ భామ తను ఆలా అనలేదని మాట మార్చింది.. ఈ స్టేట్‌మెంట్‌తో ఆమెకు మరిన్ని దక్షిణాది చిత్రాల్లో అవకాశాలైతే వచ్చాయి.. ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాల్లో నటించటానికి ఒప్పుకుందట.. అలాగే ఎన్టీఆర్‌తో ఓ పాటలో కన్పించేందుకు అమ్మడు రెడీ అయ్యింది.. తమిళంలో విక్రమ్‌ సరసన ‘స్కెచ్‌లో నటిస్తోంది.. అదేవిధంగా నయనతార నటిస్తోన్నమరో హిందీ రీమేక్‌లో మిల్కీబ్యూటీ నటిస్తోంది.
==============