మాకొద్దీ అధ్య‌క్షుడు

tom steyer
tom steyer

వాషింగ్ట‌న్ః డొనాల్డ్‌ ట్రంప్‌ను అమెరికా అధ్యక్ష పీఠం నుంచి తొలగించాలంటూ శ‌త్రువర్గం ప్రచారం చేస్తుంది. ట్రంప్‌ పై అభిసంశన తీర్మానం పెట్టేలా ప్రజలు అమెరికా కాంగ్రెస్‌ పై ఒత్తిడి తేవాలని యూఎస్‌ బిలియనీర్‌ టాయ్‌ స్టెయర్‌ టీవీల్లో, ఆన్‌ లైన్‌ వేదికల్లో ప్రచారం చేస్తున్నారు. ట్రంప్‌పై అభిసంశన తీర్మానం పెట్టాలని ప్రజలు అమెరికన్‌ కాంగ్రెస్‌ లేఖలు రాయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రంప్‌ను ఎందుకు అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి అన్న కారణాలను ఒక నిమిషం నిడివి గల వీడియోలో పొందుపరిచి టాం యూట్యూబ్‌ లో పెట్టారు. ట్రంప్‌ అణు యుద్ధ పరిస్థితులకు కారణమౌతున్నారని, అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బిఐని నిర్వీర్వం చేస్తున్నారని, విదేశాల నుంచి డబ్బు సేకరించడం, వార్త సంస్థల మూసివేతకు ఆదేశాలివ్వడం వంటి కారణాలను వీడియోలో వివరించారు. అమెరికన్‌ కాంగ్రెస్‌లోని కొందరు సభ్యుల తీరును కూడా స్టెయర్‌ తప్పుబట్టారు. కాంగ్రెస్‌ లోని సభ్యులు, ట్రంప్‌ అధికారులు ట్రంప్‌ వ్యవహారశైలి తెలిసినా స్పందిచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతోనే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. తన వీడియో ద్వారా వచ్చే 10 మిలియన్‌ డాలర్లతో ప్రజాఅభిప్రాయాన్ని అమెరికా కాంగ్రెస్‌కు వినిపించేలా చేస్తానన్నారు. రాజకీయాలు మానండి సరిగ్గా నడుచుకోండి అనే నైతిక బాధ్యతతో మెలగాలని కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచుదామని ప్రజలకు సూచించారు.