మరో డ్రగ్‌ రాకెట్‌ ముఠా గుట్టురట్టు

drug racket in hyd
drug racket in hyd

హైదరాబాద్‌: నగరంలో మరో డ్రగ్స్‌ రాకెట్‌ ముఠా గుట్టు రట్టయినట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.
ఈ వ్యవహారంలో కీలక నిందితుడు గాబ్రియెల్‌తో పాటు నవ్యాంత్‌, అంకిత్‌, బొల్లారెడ్డిని అరెస్టు చేశామని, మరో నిందితుడు
పవన్‌ కుమార్‌ పరారీలో ఉన్నాడని ఆయన తెలిపారు. గోవాలో రేవు పార్టీల పేరుతో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నిందితుడు
కెల్విన్‌తో నవ్యాంత్‌కు సంబంధాలు ఉన్నాయని అన్నారు. కెల్విన్‌ అరెస్టుతో నవ్యాంత్‌ గోవా పారిపోయాడని, సినీ పరిశ్రమలో
నవ్యాంత్‌కు సంబంధాలు ఉండే అవకాశం ఉందని అన్నారు. ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌ ఆర్డర్‌ చేసి వాటిని నెదర్లాండ్స్‌ నుంచి హైదరాబాద్‌కు
నవ్యాంత్‌ సరఫరా చేస్తున్నాడని ఆయన తెలిపారు.