మరికొన్ని షెల్టర్‌హోమ్స్‌పై దర్యాప్తు చేపట్టండి: సుప్రీం

supreem court
supreem court

పాట్నా: బీహార్‌ షెల్టర్‌హోమ్స్‌ అత్యాచారాలపై సిబిఐ విచారణకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ముజఫర్‌పూర్‌ షెల్టర్‌హోమ్‌ కేసులో ఇప్పటికే సిబిఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. మరో 16 షెల్టర్‌ హోమ్స్‌లో బాలికలపై లైంగిక దాడులు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై కూడా దర్యాప్తు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం వేసిన సంస్థను సుప్రీం ఆదేశించింది. ఈ కేసులో విచారణ జరుపుతున్న అధికారులను సైతం మార్చేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.