మనవడు దేవాన్ష్ కు దేశభక్తిని నేర్పిన తాత చంద్రబాబు

Chandra babu with his grandson-1
Chandra babu with his grandson

మనవడు దేవాన్ష్ కు దేశభక్తిని నేర్పిన తాత చంద్రబాబు 

మహాత్మా గాంధీ  జయంతి వేడుకల్లో ముచ్చటైన సంఘటన చోటు చేసుకుంది… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మనవడు దేవాన్ష్ అంటే ఎంతో ఇష్టమైన విషయం ఇప్పటికే పలు సంఘటనలు రాష్ట్ర ప్రజలకు స్పష్టం… మొన్న దుర్గ గుడికి మనవడు దేవాన్ష్ ను తీసుకెళ్లి ఆయనతోపాటు కనకదుర్గ అమ్మవారి దర్శనాన్ని, పూజలు చేయించారు.. నేడు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి కార్యక్రమానికి మనవడు దేవాన్ష్ ను వెంటపెట్టుకుని వచ్చారు
ముఖ్యమంత్రి చంద్రబాబు… ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు నివాళులు అర్పించారు.  తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన మనవడు దేవాన్ష్ కు పూలు అందించి జాతిపిత మహాత్మా గాంధీ, లాల్  బహదూర్ శాస్త్రిలకు అంజలి ఘటించేలా సూచించారు. ఆయా జాతి నేతలకు దేవాన్ష్ తో వందనం   చేయించారు…
ఆ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ” ప్రతి ఒక్కరూ దేశ నేతలకు ముఖ్యంగా స్వాతంత్య్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ తదితర దేశం కోసం ప్రాణ త్యాగాలు, దేశ సేవ కోసం తపించిన నేతల పట్ల పిన్నవయసులోనే భక్తి భావం గౌరవం కల్పించేలా ప్రేరణ కల్పించాలని” ప్రజలకు సూచించడం గమనార్హం. చిన్న పిల్లలకు దేశ ప్రముఖుల పట్ల మర్యాద, మన్ననా కలిగించడంలో… ఆ దేశ నేతల స్ఫూర్తి కలిగించే అంశాలు నూరిపోయడంలో పెద్దలైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకొవాలని సూచించారు.. ఆ స్ఫూర్తి దాయకమైన అంశాలను ప్రజలకు తెలియజెప్పాలనే దేవాన్ష్ తో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలపై భక్తిభావం, గౌరవం కలిగించాలని ఈ కార్యక్రమానికి పూనుకున్నామని వివరించారు…