మధ్యప్రదేశ్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌తో ప్రత్యేక కూటమి

AKHILESH, RAHUL
AKHILESH, RAHUL

సిపిఐ, సీపిఎంలు వ్యతిరేకం
ఆరుపార్టీలు కలిసి పనిచేసేందుకు సమ్మతి
బోపాల్‌: ఎన్నికలకు సమాయత్తం అవుతున్న మధ్యప్రదేశ్‌లో అధికారంలోని బిజెపిని కట్టడిచేసేందుకు కాంగ్రెస్‌తో సహా ఆరు రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడుతున్నాయి. ఆదివారం నిర్వహించిన ప్రత్యేకభేటీలో ఈ పార్టీలు అన్నీ కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు సంసిద్ధత వ్యక్తంచేసాయి. అయితే వామపక్ష పార్టీల వ్యతిరేకతతో ఉమ్మడి ఫ్రంట్‌ ఏర్పాటులో మాత్రం విఫలం అయింది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ బ్లాక్‌కు కాంగ్రెస్‌ పర్యవేక్షిస్తోంది. సిపిఐఎం పార్టీ మాత్రం కాంగ్రెస్‌ పార్టీ హిందూత్వవాదాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శిఓ్తంది. ఆదివారం రాష్ట్రంలో ఎనిమిది కీలక పార్టీలు సమావేశం అయ్యాయి. సిపిఐ, సిపిఎం పార్టీలు వచ్చే అక్టోబరు ఏడవ తేదీ మరోసారి సమావేశం అవుతున్నాయి. కూటమి భాగస్వామి అయిన లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ పార్టీ నాయకుడు ఇదే అంశాన్ని స్పష్టంచేసారు. ఎల్‌జెడి, సమాజ్‌వాదిపార్టీ, సిపిఐ, సిపిఎం, బహుజన్‌సంఘర్ష్‌్‌దళ్‌, గోండ్వానా గణతంత్ర పార్టీ, రాష్ట్రీయ సమంతా దళ్‌, ప్రజాతాంత్రిక్‌ సమాధాన్‌పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకుసంబంధించి కూటమి, పొత్తులపై చర్చలు జరిపాయి. అన్ని పార్టీలు కలిసి పనిచేసేందుకు అంగీకరించాయని, సిపిఐ, సిపిఎం పార్టీలుమాత్రం కాంగ్రెస్‌ను కలుపుకోవడంపై వ్యతిరేకిస్తున్నాయని ఎల్‌జెడి నేత గోవింద్‌ యాదవ్‌ వెల్లడించారు. వాస్తవానికి అతిపెద్దప్రతిపక్షాపార్టీ కావడంతో కాంగ్రెస్‌ పార్టీయే ఈ కూటమికి నాయకత్వం వహించడం సహేతుకమని ఆయన అన్నారు. 2003నుంచి మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బిజెపిని గద్దెదించే లక్ష్యంతో ఎనిమిది పార్టీలు కూటమిగా ఆవిర్భవించనున్నాయి. ఎనిమిదింటిలో ఆరుపార్టీలు పొత్తులు కూటములకు కాంగ్రెస్‌ నాయకత్వంలో పనిచేసేందుకు ముందుకువచ్చాయి. సిపిఐ, సిపిఎం మాత్రం వ్యతిరేకించాయి. సిపిఎం కార్యదర్శి సానుకూల హిందూత్వ అజెండాతో వస్తోందని విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్‌లకు మధ్య తేడా ఏమీలేదని విమర్శించారు. మతరాజకీయాలకు మతతత్వ ప్రచారానికి వామపక్ష పార్టీలు వ్యతిరేకమని, బిజెపిని ఓడించేందుకు సిద్ధమే కానీ హిందూత్వ సానుకూల వాదులతో కలిసి నడవలేమని నాయకులు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో అధికారంలోనికి వచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఇటీవలే బిఎస్‌పితో కూడా జతకట్టింది. అలాగేమరో ఆరుపార్టీలను కలుపుకోవాలని చూస్తోంది.అయితే బిఎస్‌పి మాత్రం కాంగ్రెస్‌ ఆశలను నిర్వీర్యంచేస్తూ తొలిజాబితాగా 22 మంది అభ్యర్ధులనుప్రకటించింది. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమల్‌నాధ్‌ మాట్లాడుతూ తమ పార్టీ భావసారూప్యతకలిగిన పార్టీలతో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతుందని, బిజెపిని కట్టడిచేసేందుకు బిఎస్‌పిని కూడా కలుపుకుంటామని అన్నారు. కాంగ్రెస్‌ ఎంపి అయిన కమల్‌నాధ్‌ బిఎస్‌పి అధినేత్రి మాయావతిని గడచిన జులై 15వ తేదీ కలుసుకుని చర్చలుజరిపారు.అయితే బిఎస్‌పి మాత్రం మొత్తం 230 స్థానాలకు పోటీచేస్తామని ప్రకటించింది. బిఎస్‌పి తన మొదటిజాబితానుప్రకటించిందని, ఎల్‌జెడి కూడా ఇపుడు యాంటిబిజెపి కూటమిదిశగా తన పావులు కదుపుతోంది. ఎల్‌జెడి నేత శరద్‌యాదవ్‌ వాస్తవానికి మధ్యప్రదేశ్‌నుంచి వచ్చినవారే. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ప్రతిపక్ష కూటమికి ఆయనే ముందు చొరవచూపించినట్లు సమాచారం.