మధ్యప్రదేశ్‌లో జాతీయగేయంపై వివాదం

siva raj singh, kamal nath
siva raj singh, kamal nath

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో జాతీయగేయం ఐన వందేమాతరం గీతం విషయంలో వివాదం తలెత్తింది. రాష్ట్ర సచివాలయంలో ప్రతి నెల మొదటి పని దినం రోజున వందేమాతర గీతం ఆలపించే సాంప్రదాయం గతంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐతే రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ఈ సంప్రదాయాన్ని ప్రస్తుతానికి నిలిపివేసింది. ఐతే ఈ ఆదేశాలను సరికొత్తగా అమలు చేసేందుకు ప్రస్తుతానికి నిలిపివేశామని రాష్ట్ర సియం కమల్‌నాథ్‌ వెల్లడించారు. నిన్న సచివాలయంలో వందేమాతరం పాడకపోవడంతో బిజెపి నేతలు విమర్శలకు దిగారు. వందేమాతరం దేశభక్తికి నిదర్శనమని గతంలో మూడు సార్లు సియంగా పనిచేసిన బిజెపి నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. ఈ సాంప్రదాయాన్ని కాంగ్రెస్‌ కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సియం కమల్‌నాథ్‌ స్పందిస్తూ వందేమాతరం పాడినంత మాత్రాన దేశభక్తులు అయిపోరు అని కమల్‌నాథ్‌ విమర్శించారు.