భౌతిక దాడులకు దిగడం ఆమోదయోగ్యం కాదు: వెంకయ్య

venkaiah naidu
venkaiah naidu

ఢిల్లీ: ఢిల్లీలో జరిగిన సాహిత్య వేడుకలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో
బెదిరింపులకు పాల్పడటం, భౌతికదాడులకు దిగడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ‘ఇప్పుడు కొన్ని సినిమాల విషయంలో వివాదాలు
రేగుతున్నాయి, తమ మనోభావాలను భంగం వాటిల్లుతోందని కొన్ని వర్గాలు ఆందోళనకు తెరతీస్తున్నాయని ‘పద్మావతి వివాదాన్ని
ప్రస్తావించకుండా పరోక్షంగా మాట్లాడారు. కొందరైతే ఏకంగా రివార్డులను సైతం ప్రకటిస్తున్నారు. వీరి వద్ద నిజంగా అంత డబ్బు ఉందా? అనుమానమే. ప్రతి ఒక్కరూ రూ.కోటి రివార్డు ప్రకటిస్తున్నారు. కోటి రూపాయలంటే అంత సులువా? ప్రజాస్వామ్యంలో ఇది ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదు. కేవలం ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే సమస్యను ఎదుర్కోవాలి, అదీ పద్ధతి ప్రకారం జరగాలి అని అన్నారు.