భారత్‌, యూఏఈల మధ్య అండర్‌ వాటర్‌ హైస్పీడ్‌ రైలు!

train in under sea water
train in under sea water

న్యూఢిల్లీ: భారత్‌ నుంచి దుబాయ్‌కు మధ్య త్వరలోనే అండర్‌వాటర్‌ రైలు ప్రయాణం ఉండబోతుంది. యూఏఈలోని పుజరాయ్‌ నగరం నుంచి ముంబై వరకు నీటి అడుగున రైలు మార్గాన్ని నిర్మించే యోచన చేస్తున్నట్లు యూఏఈ నేషనల్‌ అడ్వైజర్‌ బ్యూరో కంపెనీ తెలిపింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఈ ప్రాజెక్టు దోహదం చేయనుంది. భారత్‌ నుంచి ఎగుమతులకు, దిగుమతులకు చేసుకునేందుకు ఇది చక్కడా ఉపయోగపడుతుంది. నీటి అడుగున సొరంగ మార్గం నిర్మించి దాని ద్వారా రైలు నడిచే విధంగా ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 2000 కి.మీ.మేర రైలు నెట్‌వర్క్‌ ఉండనుంది. ఇప్పటికే ఇలాంటి రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చైనా, జపాన్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి.