భారత్‌ ఆర్థికంగా,సాంకేతికంగా ఎంతగానో అభివృద్ది చెందుతుంది

mody
mody

సింగపూర్‌: భారత్‌ ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతుందని మోడి అన్నారు. ఈరోజు ఉదయం సింగపూర్‌ చేరుకున్న ప్రధాని మోడి ఈ ‘ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు పెట్టుబడులకు భారత్‌ ఇష్టమైన గమ్యంగా మారుతుందని ఆయన అన్నారు. ఫైనాన్షియల్‌ టెక్నాలజీపై సింగపూర్‌ వేదికగా అతిపెద్ద కార్యక్రమం జరుగుతుంది.   2016 నుంచి ఈ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన తొలి ప్రపంచ నేత ప్రధాని మోదీనే కావడం విశేషం. ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో ప్రసంగించడం గర్వంగా ఉందని మోదీ ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ రెండు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు.