‘భారతీయుడు’కి సీక్వెల్‌ !

bharatiyudu-2 motion poster
bharatiyudu-2 motion poster

శంకర్‌, కమల్‌ కాంబినేషన్‌లో 22 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి ఇప్పుడు సీక్వెల్‌ చేయబోతున్నారు. రూ. 180 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని ఏక కాలంలో తీయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. కమల్‌కు జోడీగా, కాజల్‌ లేదా నయనతారలు నటిస్తారని సమాచారం. ఇంకా ఈ సినిమాలో దుల్కర్‌ సుమన్‌, అజయి దేవగన్‌ నటిస్తారని సమాచారం. ఈ చిత్రం డిసెంబరు 14న సెట్స్‌ పైకి వెళుతుందని సమాచారం. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుంది. అనిరుధ్‌ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు.