భాగ్యనగరంలో దాడులకు ‘ఉగ్ర రెక్కీ

 

REKKI
హైదరబాద్‌: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దాడులకు గాను ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు. జనవరి 26 రిపబ్లిక్‌ డే సందర్భంగా ఉగ్రవాదులుదాడులు చేసేందుకు కుట్రపన్నుట్టు ఇంటెలిజెన్స్‌ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్‌:లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల అదుపులో ఉన్న ఆఅబు అమాజ్‌, షరీఫ్‌ ఒబేదుల్లా అనే ముగ్గురు ఉగ్రవాదులు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సైకిళ్లు, స్కూటర్లలో పైపు బాంబలు అమర్చి పేల్చేందుకు కుట్రపన్నినట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరి వద్ద నుంచి అమ్మోనియం, గన్‌పౌడర్‌, బాంబుల తయారీ వీడయోలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులకు ఇరాక్‌ నుంచి భారీ మొత్తంలో నిధులు సమకూరినట్టు, భువనేశ్వర్‌- ముంబై గో ఎయిర్‌ విమానాన్ని పేల్చివేస్తామని బెదిరించటంతో నాగపూర్‌ అత్యవసరంగా ల్యాండ్‌ అయినట్టు తెలిపారు.