భవిష్యత్తు ‘ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌’ మీద అధారపడనుంది: పుతిన్‌

russia president vladimir puthin
russia president vladimir puthin

రష్యా: అధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ‘అర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ రంగంలో పట్టు సాధించిన దేశం
ప్రపంచాన్ని ఏలుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వెల్లడించారు. సెప్టెంబర్‌ 1న రష్యాలో
విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులను
ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘భవిష్యత్తు అర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ మీద అధారపడనుందని, రష్యా
మాత్రమే కాదు మొత్తం మానవాళి దాని ఆధారంగానే పని చేయనుందని అన్నారు. ‘అర్టిఫిషియల్‌
ఇంటలిజెన్స్‌ రంగంలో ఎన్ని అవకాశాలున్నాయో అన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని మనం
ఊహించలేం అందుకే ఈ రంగాన్ని ఒక దేశానికి మాత్రమే పరిమితం కాకుండా చూసుకోవాలని,
అణుశక్తి జ్ఞానాన్ని పంచుకుంటున్నట్లుగానే అర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ పరిజ్ఞానాన్ని కూడా దేశాలు
పంచుకోవాలని ఆయన తెలిపారు.