బ్రాండ్‌ అంబాసిడర్‌గా..

RAKUL PREET SINGH
RAKUL PREET SINGH

బ్రాండ్‌ అంబాసిడర్‌గా..

వెండితెర స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన ఒక సామాజికి కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు.. అదే ‘బేటీ బచావో..బేటీ పడావో ఈ కార్యక్రమానికి గానూ తెలంగాణ తరపున ప్రభుత్వం ఆమెను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది.. ‘బేటీ బచావో.. భేటీ పడావో అనేది దేశంలోని మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం తలపెట్టిన ప్రముఖ సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమైంది. స్వతహాగానే స్వతంత్య్ర భావాలు కలిగి, సామాజిక అభివృద్ది పట్ల, మహిళల పురోగతి పట్ల ఎక్కువగా శ్రద్దచూపే రకుల్‌ ఇలా తెలంగాణ ప్రభుత్వం తనను ఈ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించటం పట్ల సంతోషం వ్యక్తం చేశారామె.. ఈ మహత్తర కార్యక్రమంలోతాను కూడ భాగమవటం గౌరవంగా భావిస్తున్నాని చెప్పారు.