బ్యాంకు ఖాతాదారులారా బహుపరాక్‌…

net banking
net banking

కొత్త తరహా మోసాలకు తెరలేపిన నైజీరియన్‌ మోసగాళ్లు
నైజీరియన్‌ ముఠాలకు సెల్‌ఫోన్‌ కంపెనీ నిర్వాహకుల సహకారం…?
హైదరాబాద్‌: ఇప్పటి వరకు అనేక రకాల మోసాలు, ఘరానా నేరాలకు పాల్పడిన నైజీరియన్లు తాజాగా మరో కొత్త రకం గోల్‌మాల్‌ వ్యవహారాలకు శ్రీకారం చుట్టారు. దేశంలోనే బహుషా తొలిసారిగా వెలుగు చూసిన ఈ తరహా నేరాన్ని సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేసినా ఇటువంటి మోసా లు దేశ వ్యాప్తంగా అనేకచోట్ల జరిగి వుంటాయని భావిస్తున్నారు. ఇంటర్నెట్‌, ఆన్‌లైన్‌ బాంకు ఖాతాలు కలిగివున్న బడా కంపెనీలను టార్గెట్‌ చేసిన నైజీరియ న్లు వారి ఖాతాల నుంచి నిమిషాల వ్యవధిలో లక్షలాది రూపాయలను కాజేసిన వైనం పోలీసులను సైతం షాక్‌ గురిచేయసాగింది. ఈ తరహా నేరాల నేపథ్యం లో ఇంటర్నెట్‌, ఆన్‌లైన్‌ బ్యాంకు ఖాతాలు కలిగిన వారు మరింత అప్రమత్తంగా వుండాలని పోలీసులు కోరుతున్నారు. కాగా ఈ తరహా మోసాలకు పాల్పడు తున్న నైజీరియన్‌ ముఠాలకు సెల్‌ఫోన్‌ కంపెనీ నిర్వాహకుల సహకారం వుండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతుండగా ఈ దిశగా పోలీసులు విచారిస్తున్నారు.
క్రెడిట్‌, డెబిట్‌, ఎటిఎం కార్డులు కలిగిన వారి ఖాతాల నుంచి వైట్‌ కాలర్‌ నేరగాళ్లు డబ్బులు కాజేయడం చాలా కాలం నుంచి జరుగుతుండడం అందరికి తెలిసిందే. బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన వారికి గుర్తు తెలియని వ్యక్తులు తాము బ్యాంకు అధికారులమని చెబుతూ వారి డెబిట్‌, క్రెడిట్‌, ఎటిఎం కార్డుల నంబ ర్లను తెలివిగా కాజేసి, ఆనక వారి ఖాతాల నుంచి నిమిషాల వ్యవధిలో డబ్బులు కాజేస్తున్న ముఠాల సంగతి తెలిసిందే. ఈ తరహా నేరాల నేపథ్యంలో బ్యాం కులు తరచూ తమ ఖాతాదారులకు అప్రమత్తం చేస్తున్నా ఇటువంటి నేరాలు మాత్రం ఆగడం లేదు. ఈ నేరాలకు తోడుగా అన్నట్లుగా కొందరు నేరగాళ్లు పెట్రో ల్‌ బంకులు, షాపింగ్‌ మాల్స్‌ వద్ద తిష్ట వేసి క్రెడిట్‌, డెబిట్‌, ఎటిఎం కార్డులు వాడుతున్న వారిపై నిఘా వుంచి పిన్‌ నంబర్లను అక్కడి సిబ్బంది సహకారంతో తీసుకుని, వాటిని క్లోనింగ్‌ చేసి కొత్త కార్డుల ద్వారా నగదును దోచుకుంటున్న ఘటనలు కూడా అనేకం వెలుగు చూస్తున్నాయి. ఈ నేరాల విషయంలో డెబిట్‌, క్రెడిట్‌, ఎటిఎం కార్డులు కలిగిన వారు జాగ్రత్త పడుతుండడం గమనార్హం. అయితే వీటన్నింటికి భిన్నంగా తాజాగా వెలుగు చూసిన మరో నేరం సిం కార్డుల స్వాప్‌ ద్వారా ఇంటర్నెట్‌, ఆన్‌లైన్‌ బ్యాంకుల ఖాతాలు కలిగిన వారి నుంచి కొందరు నేరగాళ్లు లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. ఈ తరహా మోసాలు చేస్తున్న నేరగాళ్ల ముఠాకు నైజీరియన్లు డాన్‌లుగా వ్యవహరిస్తుండడం విశేషం. దేశ వ్యాప్తంగా బడా కంపెనీల వివరాలను ఈ ముఠా ఒక పథకం ప్రకారం సేకరిం చడం, ఆనక వీటి నిర్వాహకుల సెల్‌ఫోన్‌ నంబర్లను కూడా తెలుసుకుని అనంతరం పక్కాగా వ్యవహరించి వారి ఖాతాల నుంచి నగదును కాజేస్తున్నారు. ఇందు కోసం ఈ ముఠా ఎంచుకున్న పద్దతి బ్యాంకు అధికారులతో పాటు పోలీసులను సైతం షాక్‌కు గురిచేసిందంటే నేరగాళ్ల వ్యూహం ఎంత పగడ్బందీగా వుందో ఊ హించుకోవచ్చు. పథకం ప్రకారం బడా కంపెనీ నిర్వాహకుల సెల్‌ఫోన్‌ నంబర్లను కాజేస్తున్న ముఠా అనంతరం ఈ నంబర్ల యజమానులము తామేనని తప్పుడు పత్రాలు సృష్టించి, ఈ పత్రాలను సెల్‌ఫోన్‌ కంపెనీలకు ఇచ్చి డూప్లీకేట్‌ సిం కార్డులను తీసుకుంటుంది. ఈ నంబర్లను తమ వద్ద అంతకు ముందే వున్న అధు నాతన యంత్రాలలో వుంచి వాటిలోని అన్ని వివరాలను తెలుసుకుంటున్న నైజీరియన్‌ ముఠాలు అనంతరం అర గంట లేదా గంట పాటు సెల్‌ఫోన్‌ నంబర్లను పనిచేయకుండా చూస్తోంది. ఈ విషయాలేవి సెల్‌ఫోన్‌ అసలు యజమానులకు తెలియవు. సరిగ్గా ఇదే సమయంలో నైజీరియన్‌ ముఠాలు వారి ఇంటర్నెట్‌, ఆన్‌ లైన్‌ బ్యాంకు ఖాతాల నుంచి సిం కార్డు స్వాపింగ్‌ పద్దతి ద్వారా, ఆన్‌లైన్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా లక్షలాది రూపాయలను కాజేస్తున్నాయి. దీంతో బడా కంపెనీ నిర్వాహకులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించి తాము మోసపోయిన వైనంపై ఫిర్యాదు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి ఇ లాగే మోసపోయి తొమ్మిది లక్షల రూపాయలు పోగొట్టుకోగా దీనిపై విచారణ చేబట్టిన సైబరాబాద్‌ పోలీసులు అసలు గుట్టును రట్టు చేశారు. ఇలాంటి నేరం రాష్ట్రంలో వెలుగు చూడడం ఇదే తొలిసారి కాగా ఈ కేసులో అరెస్టయిన ముఠా దేశ వ్యాప్తంగా 20 పైగా బడా కంపెనీల నుంచి ఇదే పద్దతిన రెండు కోట్ల రూపాయలకు పైగా కాజేసింది. ఈ ముఠాలో ఆరుగురు పట్టుబడగా ఇందులో ఒకడు నైజీరియన్‌ వున్నాడు. ముఠా నాయకుడుగా వున్న మరో నైజీరియన్‌ ఇంకా పట్టుబడలేదు.
సెల్‌ఫోన్‌ కంపెనీల పాత్రపై అనుమానం…ఆ దిశగా సాగుతున్న పోలీసుల విచారణ
ఇదిలావుండగా ఇంటర్నెట్‌, ఆన్‌లైన్‌ బ్యాంకు ఖాతాలు కలిగిన బడా కంపెనీల నిర్వాహకుల డబ్బులను కాజేస్తున్న నైజీరియన్‌ ముఠాలకు స్థానిక నేరగాళ్లు స హకరిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే సమయంలో సిం స్వాపింగ్‌ పద్దతిలో నేరాలు చేస్తున్న ఈ ముఠాలకు కూడా ఆయా ప్రాంతాల నేరగాళ్లు స హకరించడం మరో విశేషం. అయితే ఈ గోల్‌మాల్‌లో సెల్‌ఫోన్‌ కంపెనీల నిర్వాహకుల పాత్రపై పోలీసులకు అనుమానాలు రాసాగాయి. సాధారణంగా ఎవరి దైనా సెల్‌ఫోన్‌ లేదా సిం కార్డు పోతే వాటికి సంబంధించి డూప్లీకేట్‌ కార్డులు పొందడం ఎప్పటి నుంచో వస్తుంది. అయితే ఈ విషయంలో సెల్‌ఫోన్‌ కంపెనీల నిర్వాహకులు సిం కార్డుల అసలు యజమానుల నుంచి అనేక పత్రాలతో పాటు అనేక వివరాలు తీసుకుని, ఇవన్నీ సరైనవే అని నిర్దారించుకున్న తరువాత డూ ప్లీకేట్‌ సిం కార్డులు ఇస్తుంటారు. ఒకరికి బదులు మరొకరు వస్తే డూప్లీకేట్‌ సిం కార్డుల ఇవ్వడం అనేది జరగదు. ప్రముఖ వ్యక్తులు, బడా కంపెనీల యజమాను ల విషయంలో సెల్‌ఫోన్‌ నిర్వాహకులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. డూప్లీకేట్‌ సిం కార్డులు పొందే విషయంలో ఇన్ని నిబంధనలు వున్నప్పటికీ నైజీరియ న్‌ ముఠాలు దేశ వ్యాప్తంగా బడా కంపెనీల నిర్వాహకుల సెల్‌ఫోన్‌లు పోయాయని చెబుతూ తప్పుడు పత్రాలు ఇవ్వడం ద్వారా డూప్లీకేట్‌ సిం కార్డులు పొంద డం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ గోల్‌మాల్‌ వ్యవహారంలో సెల్‌ఫోన్‌ కంపెనీల సిబ్బంది పాత్ర వుంటేనే ఇదంతా సాధ్యమవుతుందని పోలీసులు గ ట్టిగా నమ్ముతున్నారు. సెల్‌ఫోన్‌లు పోయాయని, సిం కార్డులు చోరీకి గురయ్యిందని చెబుతూ ఎవరు పడితే వారు డూప్లీకేట్‌ సిం కార్డులకు దరఖాస్తు చేయడం గంట లేదా రెండు గంటల వ్యవధిలోనే కొత్త సిం కార్డులను పొందడం ఆషామాషీ వ్యవహారం కాదని పోలీసులు విశ్వసిస్తున్నారు. ఈ నేరంలో సెల్‌ఫోన్‌ కంపె నీల సిబ్బంది లేదా అధికారుల పాత్ర వుండివుండవచ్చని విశ్వసిస్తున్న పోలీసులు ఈ దిశగా విచారిస్తున్నారు. ఒకవేళ ఇది నిజమని తేలితే నేరగాళ్లకు సహకరిం చినందుకు సెల్‌ఫోన్‌ కంపెనీల అధికారులు, సిబ్బంది అరెస్టయ్యే అవకాశాలున్నాయి. దీనిపై వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.