బురారీని సంద‌ర్శించిన సీఎం కేజ్రీవాల్‌

Arvind Kejriwal
Arvind Kejriwal

దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపిన మృతదేహాల ఘటన స్థలాన్ని సీఎం అర‌వింద్‌ కేజ్రీవాల్‌ పరిశీలించారు. ఢిల్లిలోని బురారీలో ప్రాంతంలో ఓ ఇంట్లో 11 మృతదేహాలు ఉండడం కలకలం రేపిన విషయం విదిత‌మే. విషయం తెలుసుకున్న సీఎం కేజ్రీవాల్‌ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాగా మృతదేహాల కళ్లకు గంతలు, నోట్లో గుడ్డలు ఉండడాన్ని గుర్తించిన పోలీసులు వీరిది హత్యా.. ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.