బీహార్‌, యుపిలు వెనుకబడి ఉన్నాయి

AMITABH KANTH
AMITABH KANTH

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్‌ సంస్థ సిఈఓ అమితాబ్‌ కాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలతో కూడిన తూర్పు ప్రాంతం మన దేశంలో వెనకబడి ఉన్నాయి అన్నారు. సామాజిక అంశాల్లో వెనుకుబాటు తనానికి ఈ రాష్ట్రాలే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. మానవాభివృద్దిలో మాత్రం చాలా వెనుకబడే ఉన్నామని చెప్పారు. దక్షిణ, పశ్చిమ భారత దేశంలోని రాష్ట్రాలు మంచి పనితీరుతో అభివృద్ధిలో వేగంగా ముందుకు వెళుతున్నాయని చెప్పారు. భారతదేశంలో మహిళలకు కూడా అవకాశాలు కల్పించేలా విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని అమితాబ్‌ కాంత్‌ అభిప్రాయపడ్డారు.