బీఎస్ఎఫ్‌, పాకిస్థాన్ రేంజ‌ర్స్ సంయుక్త చ‌ర్చ‌లు

bsf and pak rangers
bsf and pak rangers

ఢిల్లీ: బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), పాకిస్థాన్ రేంజర్స్ సంయుక్తంగా చర్చలు నిర్వహించాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కారం కోసం కమాండెంట్ స్థాయి చర్చలు నిర్వహించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బీఎస్‌ఎఫ్, పాక్ రేంజర్లు మధ్య గత ఏడాదిన్నర నుంచి చర్చలు నిలిచిపోయాయి. కమాండెంట్ స్థాయి చర్చలకు రెండు దేశాలు అంగీకరించినట్లు బీఎస్‌ఎఫ్ డైరక్టర్ జనరల్ కేకే శర్మ తెలిపారు. సుమారు 19 మంది సభ్యుల పాక్ రేంజర్ల ప్రతినిధుల బృందం ఈ చర్చల్లో పాల్గొన్నారు. 44వ డైరక్టర్ జనరల్ స్థాయి చర్చల్లో పాల్గొనేందుకు పాక్ రేంజర్లు భారత్‌కు వచ్చారు. క్రాస్ బోర్డర్ ఫైరింగ్, నార్కోటిక్స్ స్మగ్లింగ్, చొరబాటుదారులు, టన్నెళ్ల సమస్యల గురించి పాక్ రేంజర్లకు తెలియజేసినట్లు బీఎస్‌ఎఫ్ వెల్ల‌డించింది.