బిజెపి విజ‌యానికి మోదికి ,అమిత్‌షాకు స‌న్మానం

modi
modi

న్యూఢిల్లీః త‌న‌ దేహం దేశం కోస‌మే అని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ భావోద్వేగపూరితంగా చెప్పారు. గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మోదీ, బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా నాయ‌క‌త్వంలో ఆ పార్టీ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వారిరువురికీ ఢిల్లీలో బీజేపీ పెద్ద‌లు స‌న్మానం చేశారు. ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ భావోద్వేగానికి గుర‌య్యారు. ఇప్పుడు బీజేపీ 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉంద‌ని అన్నారు. మాజీ ప్రధాని ఇందీరాగాంధీ హ‌యాంలో కాంగ్రెస్ పార్టీ 18 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉందని తెలిపారు. అధికారాన్ని సాధించ‌డం ప్రజల కోసమేన‌ని, వారిని మేలు చేయ‌డానికేన‌ని అన్నారు. తన నుంచి ఇంకా ఎంత పని ఆశిస్తున్నారో అదంతా చేసి చూపెడ‌తాన‌ని చెప్పారు.