బిజెపికి, శివసేన చురకలు

uddhav thakeray
uddhav thakeray

న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రస్తుతం వాడుతున్న ఈవిఎంలను అమెరికా, లండన్‌లలో కూడా వాడితే బిజెపినే గెలుస్తుందని శివసేన ఎద్దేవా చేసింది. ఎన్డీఏ కూటమిలోనే ఉంటూ అప్పుడప్పుడు బిజెపికి ,శివసేన చురకలంటిస్తూ ఉంటుంది. తాజాగా సామ్నా పత్రిక సంపాదకీయంఓ బిజెపి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ త్వరలో మరుగై, అసలు నిజం తెలిసివస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తానని దేశ ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించిన పత్రిక , ఈ విషయంలో బిజెపి వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్‌ చేసింది. రానున్న ఎన్నికల్లో ఎవరూ ఊహించని పరిస్థితి నెలకొంటుందని, బిజెపికి కష్టకాలం ముందుందని అభిప్రాయపడింది. ఈ సారి ఎన్నికల్లో మహారాష్ట్రీయులు బిజెపికి అండగా నిలిచేందుకు సిద్ధంగా లేరని, పునరాలోచించుకుంటున్నారని పేర్కొంది. రామమందిరంపై ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఇప్పటివరకూ స్నేహితులుగా ఉన్న వారందరూ దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించింది.