బాక్సర్ అమిత్ పై ప్రశంసల వెల్లువ

రాజకీయ నేతల, నెటిజన్ల ప్రశంసల వర్షం

రష్యా లో నిర్వహిస్తున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో మన బాక్సర్ అమిత్ పంగల్ రజతం సాధించి మొదటి భారతీయ బాక్సర్ పురుష కేటగిరి లో రజతాన్ని సాధించిన వాడిగా రికార్డుకెక్కాడు. సామాజికి మాధ్యమాలలో గత రాత్రి నుంచి అమిత్ పై ప్రశంసలు వెల్లువై కురుస్తున్నాయి.

భారత్ మాజీ రాష్టపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు అమిత్ పంగల్ ను ట్విట్టర్ వేదికగా “మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ” అని ప్రశంసించారు.

బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే కూడా ” మీరు చరిత్ర తిరగ రాసారు మీరు ఇలాగె కొనసాగండి” అని ట్వీట్ చేసారు

మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి https://www.vaartha.com/news/sports/