బలపడుతున్న పౌర అణు’బంధం

nuclear deal
Nuclear deal

బలపడుతున్న పౌర అణు’బంధం

భారత్‌ తనకు సహజభాగస్వామిగా పరిగణిస్తున్న జపాన్‌తో వాణిజ్యబంధం మరింత బలపడిం ది. రెండురోజుల పర్యటనలో ప్రధాని మోడీ చిరకాలంగా సంప్రదింపులమధ్యనే నలుగుతున్న అణు సహకార ఒప్పందాన్ని ఎట్టకేలకు ఖరారుచేసుకోవడంతో భారత్‌పరంగా అణుఇంధన సహకారంలో మరో అడుగు ముందుకేసినట్లయింది. అణుఇంధన రంగంలో జపాన్‌ కంపెనీలతో అగ్రరాజ్యం అమెరికాలోని పలు కంపెనీలు సైతం పొత్తులు పెట్టుకుంటున్నాయి. ఈనేపథ్యంలో భారత్‌తో పౌరఅణుసహకార ఒప్పందంపై సంతకాలు చేయడం భారత్‌తో చిరకాల చెలిమికి జపాన్‌ ఆసక్తితో ఉందని అంచనా. ఇప్పటికే భారత్‌లో హైస్పీడ్‌ బుల్లెట్‌ రైళ్లుప్రాజెక్టుల్లో భారీఎత్తున పెట్టుబడులు పెట్టిన జపాన్‌ మరిన్నిరంగాల్లో విస్తరణకు యోచిస్తున్నది. అణు పరిజ్ఞానం, రియాక్టర్లను భారత్‌కు ఎగుమతి చేసుకునేందుకు వీలుగా ఈ ఒప్పందం బాటలు వేసింది. ఇండో అమెరికా అణుసహకార ఒప్పందం అమలుకు జపాన్‌తో జరిగిన ఒప్పందం మరింత దోహంచేస్తుందని, జపాన్‌ పార్ల మెంటు ఆమోదంపొందినవెంటనే ఈ ఒప్పందం అమలు లోనికి వస్తుందని అంచనా. శుద్ధిఇంధనఉత్పత్తి భాగస్వా మ్యం మరింత విస్తరించుకునేదిశగా ఈ ఒప్పందం చారి త్రాత్మక ఒప్పందంగానే భావించాలి.

వివిధ రంగాలకు సంబంధించి మరో తొమ్మిది ఒప్పందాలపై సంతకాలు జరగడంతో మోడీ జపాన్‌ పర్యటన విజయ వంతం అయిందనే చెప్పాలి. సుమారు ఆరేళ్లకుపైబడి రెండు దేశాల మధ్యపౌర అణుఇంధన ఒప్పందంపై సంప్రదిం పులు జరుగుతూనే ఉన్నాయి. చివరకు మోడీ తన పర్య టనతో ఈఒప్పందాన్నిసుసాధ్యం చేసుకోగలిగారు. అంతే కాకుండా భారత్‌ జపాన్‌ను సహజభాగస్వామిగా పరిగణి స్తోంది.పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, మానవవన రుల వంటి విభాగాల్లో పరస్పరప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. రెండుదేశాల మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మ క భాగస్వామ్యం వల్లనేశాంతి, సుస్థిరత, సమతుల్యత వంటివి నెలకొంటున్నట్లు ఇరుదేశాల ప్రధానులు స్వయంగా ప్రకటించడం గమనించదగ్గ అంశం. అంతేకా కుండా ఇరుదేశాలు కూడా అణువ్యాప్తి నిరోధక ఒప్పం దాన్ని విశ్వవ్యాప్తంచేయాలని భావిస్తున్నాయి. అణునిరాయుధీకరణ ఒప్పందాలను వీలైనంత త్వ రగా ప్రారంభించాలన్న దేశాల్లో జపాన్‌ కూడా ఒకటిగా ఉంది.

కేవలం అణుఇంధన ఒప్పందంతోనే సరిపెట్టుకో కుండా మోడీ తన పర్యటనను రైల్వేలు, రవాణా నౌకా శ్రయాల్లో టెర్మినల్‌, టోల్‌వసూలు రోడ్లు నిర్మాణం, విమానాశ్రయటెర్మినళ్లు,పట్టణాభివృద్ధిలో మౌలికవసతలు ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ప్రోత్సాహం వంటివివాటికి పర స్పర అవగాహన ఒప్పందం చేసుకున్నారు. అలాగే శాస్త్ర విజ్ఞానపరంగా భారత్‌తోపాటు జపాన్‌ ఎంతోముందంజ లో ఉంది. అంతరిక్షంలో ఉపగ్రహ నేవిగేషన్‌,గ్రహాల పరిశోధనలో పరస్పరం సహకరించుకునేందుకు ముందు కువచ్చాయి. వీటితోపాటే వ్యవసాయం, ఆహారపరిశ్రమ ల్లో సహకరించుకోవాలని, భౌగోళిక గుర్తింపు కాపాడు కోవాలన్న ఒప్పందాలు ఉభయతారకంగా ఉన్నాయి. అన్నింటికంటే ముందునైపుణ్య అభివృద్ధిపై భారత్‌ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. ఇందుకోసంజాతీయస్థాయిలో వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేసి ప్రత్యేక మంత్రిత్వశాఖను సైతం నిర్వహిస్తోంది.

జపాన్‌తో ఈ పరస్పర సహకారంపైనే ఒప్పందంచేసుకుంది. ఇక ఒలిం పిక్‌ క్రీడలు, పాలింపిక్‌క్రీడలు వంటివాటితోపాటు విద్య, వాణిజ్యం, సంస్కృతి, విపత్తులనిర్వహణ, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో పరస్పరం సహకరించుకునే దిశగా ప్రధానిమోడీ పర్యటనసాగిందనే చెప్పాలి. అన్నింటికంటే ముందు గుజరాత్‌రాష్ట్రంతోపాటు జపాన్‌హ్యోగో ప్రాంత ప్రభుత్వాల మధ్యపరస్పర అభివృద్ధికి ఒప్పందంచేసు కోవడం మౌలికవసతుల వృద్ధిపై కేంద్రానికి ఉన్న ప్రాధా న్యతలను స్పష్టంచేస్తోంది. వీటితోపాటే ఇరుదేశాలప్రధా నుల సమావేశంలో దక్షిణచైనా సముద్ర వివాదాలను శాంతి యుతపరిష్కారంవైపే మొగ్గుచూపించాయి.

ఈ జలాల్లో స్వేఛ్ఛాయుత నౌకాయానం, గగన తల ప్రయా ణం, ఆటంకాలులేని వాణిజ్యానికి కట్టుబడి ఉన్నట్లు ప్రక టించడం అంతర్జాతీయ అంశాలకు సైతం ప్రాధాన్యతను ఇచ్చినట్లు మోడీపర్యటన స్పష్టంచేస్తోంది. పైగా ఇతర దేశాలు దక్షిణచైనా సముద్రజలాల వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని భావిస్తున్నచైనాకు సహజంగానే ఈ వ్యాఖ్య లు ఆగ్రహం రప్పిస్తాయి. భవిష్యత్‌ దృష్ట్యా దక్షిణచైనా సముద్రజల వివాదాలను ఆ పరీవాహక దేశాలతో కలిసి పరిష్కరించుకోవాల్సిన బాధ్యతభారత్‌పైఉంది. అందుకే మోడీజపాన్‌ పర్యటనలో ప్రధాన ప్రస్తావనకువచ్చింది. ఇక ఉగ్రవాద సురక్షిత అడ్డాలను నిర్మూలించడంతో పాటు తీవ్రవాదం, ఉగ్రవాదాలపై విశ్వవ్యాప్త ఐక్యవేదిక నుంచే ఉమ్మడిపోరు జరగాలన్న ఆకాంక్షను వ్యక్తంచేసిన ఇండోజపాన్‌ మైత్రీబంధం భవిష్యత్తులో మరింత ధృడ పడుతుందనే ఆశించాలి.

జపాన్‌కు చెందిన పరిశ్రమలు, ఇన్వెస్టర్లు భారత్‌లోఇప్పటికే పలుసంస్థల్లో వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు కుమ్మరించారు. మరికొన్ని సంస్థలు మేకిన్‌ఇండియా స్ఫూర్తితో భారత్‌లో పెట్టుబడులు లేదా జాయింట్‌ వెంచర్లకు ముందుకువస్తున్నాయి. పారిశ్రామి క కారిడార్లు, హౌస్పీడ్‌ బుల్లెట్‌రైళ్లు వంటివి వీటిలో కీల కమనేచెప్పాలి. వీటితోపాటే భారీయంత్ర పరికరాల ఉత్ప త్తిలో కూడా జపాన్‌ ప్రపంచదేశాల్లో కూడా అగ్రగామిగా ఉంది. భారత్‌లో పెట్టుబడులకు సానుకూల వాతావర ణం మరింత పెరిగిందన్న ప్రపంచబ్యాంకు, ఇతర అంత ర్జాతీయ సంస్థల సానుకూల సంకేతాలతో ఆసియాలోనే అతిపెద్ద అభివృద్ధి చెందిన దేశంగా ఉన్న జపాన్‌ పెట్టు బడులు భారత్‌లో మరింత పెరుగుతాయన్న భావన మోడీపర్యటనతో మరింతస్పష్టం అయిందని చెప్పవచ్చు.

-దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, వార్త