బడ్జెట్‌ ఎఫెక్ట్ట్‌

 

sensexfff

బడ్జెట్‌ ఎఫెక్ట్ట్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్ల జోష్‌

ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన పెట్టిన బడ్జెట్‌ మార్కెట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపింది. బడ్జెట్‌ ప్రసంగానికి ముందు భారీగా నష్టపోయిన మార్కెట్లు ఆయన బడ్జెట్‌ ప్రసంగం పూర్తయే సరికి పుంజుకోవటం ప్రారంభించాయి. ఒక దశలో 600 పాయింట్‌లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌ బడ్జెట్‌ మార్కెట్లకు అనుకూలంగా ఉండటంతో పుంజుకోవటం ప్రారంభించింది. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో సెన్సెక్స్‌: 77 పాయింట్ల లాభంతో 23771 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ: 30 పాయింట్ల లాభంతో 7059 వద్ద కొనసాగింది.