ఫ్యామిలీతో ఎంజాయ్

Rakul3
Rakul Preet Singh

ఫ్యామిలీతో ఎంజాయ్

సాదారణ మానవుడి కంటే సెలబ్రెటీలు జీవితంతో పరుగులు తీయాల్సిందే. సినీ తారల లైఫ్ లో ఒక్కోసారి కనీసం తినే తీరిక కూడా ఉండదు. ఒకే రోజు నాలుగు పనులను చేయాలంటే స్పెషల్ గా టైమ్ టేబుల్ ని సెట్ చేసుకొని అటు ఇటు పరుగెత్తాలి. ఒక్కోసారి ఆ బిజీ షెడ్యూల్ వలన వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. తలపోటు వచ్చినా సరే కంట్రోల్ చేసుకొని పనులను పూర్తి చేస్తారు.

మరి ఆలాంటి షెడ్యూల్ తో సతమతమైతే ఒక్కసారైనా రెస్ట్ తీసుకోవాలి కదా! అందుకే తారలు షూటింగ్ కి బ్రేక్ చెప్పేసి కొన్ని రోజుల పాటు అలా దేశాలు చుట్టేసి ప్రశాంతంగా గడుపుతారు. లేకుంటే ఇంట్లో వాళ్ళతోనే హ్యాపీగా గడుపుతారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రకుల్ కూడా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోందట. ఏ షూటింగ్ లేదు. షెడ్యూల్ టైమ్ – టేబుల్ అనే మాటలకు దూరంగా ఉంటూ హ్యాపీగా ఉంటున్నాని చెబుతోంది. ఎందుకంటే అమ్మడు గత కొంత కాలంగా తీరిక లేకుండా షూటింగ్ పనులల్లో చాలా బిజిగా ఉంటోంది. ఇటీవల విడుదలైన స్పైడర్ సినిమా కోసమైతే అమ్మడు ఎక్స్ట్రా కాల్షీట్స్ కూడా ఇచ్చిందట.

నిజానికి 2014 నుండి రకుల్ కి అస్సలు సరిగ్గా బ్రేక్ దొరకలేదు. ఏడాదికి మూడు సినిమాలు రిలీజ్ చేస్తూ వస్తోంది. కానీ ఇప్పుడు ఒక పది రోజులు బ్రేక్ దొరకడంతో అమ్మతో హ్యాపీగా ఉంటున్నానని చెప్పింది. ఇక నెక్స్ట్ తమిళ్ లో కార్తితో తీసిన ఖాకి సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అలాగే సూర్య తో కూడా ఒక సినిమాను ఒకే చేసింది. మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. హాలిడేస్ తర్వాత ఇక తన రెగ్యులర్ సినీ లైఫ్ లోకి రకుల్ అడుగుపెడుతుందట.