ఫోర్బ్స్‌ 2018 టాప్‌ 100 శ్రీమంతుల జాబితా

forbes list 2018 india
forbes list 2018 india

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలో అత్యధికంగా ఆర్జించిన వంద మంది సెలబ్రిటిల జాబితాను ఫోర్బ్స్‌ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈజాబితాలో బాలీవుడ్‌ దబాంగ్‌ ‘సల్మాన్‌ ఖాన్‌’ ఆగ్రస్థానం దక్కించుకున్నారు. 2018లో సల్మాన్‌ వార్షికాదాయం రూ.253,25కోట్లు. ఆ తర్వాత స్థానంలో టిమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రూ.228,09కోట్లు ఉన్నారు. బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె నాలుగో స్థానంలో ఉన్నారు. టాప్‌ 100 జాబితాలో తొలి ఐదు స్థానాల్లో చోటు సంపాదించిన ఏకైక మహిళ సెలబ్రిటి దీపిక కావడం విశేషం. టాప్‌ 10 జాబితాలో    ఎవరున్నారంటే:
• సల్మాన్‌ ఖాన్‌ (‌ రూ.253.25 కోట్లు)
•విరాట్‌ కోహ్లీ (రూ.228.09 కోట్లు)
• అక్షయ్‌ కుమార్‌ (రూ.185 కోట్లు)
•దీపిక పదుకొణె (రూ.112.8 కోట్లు)
• మహేంద్ర సింగ్‌ ధోనీ (రూ.101.77 కోట్లు)
• ఆమిర్‌ ఖాన్‌ (రూ.97.5 కోట్లు)
• అమితాబ్‌ బచ్చన్‌ (రూ.96.17 కోట్లు)
•రణ్‌వీర్‌ సింగ్‌ (రూ.84.67 కోట్లు)
•సచిన్‌ తెందుల్కర్‌ (రూ.80 కోట్లు)
•అజయ్‌ దేవగణ్‌ (రూ. 74.5 కోట్లు)
టాప్‌ 100 జాబితాలో మన టాలీవుడ్‌ ప్రముఖులు కూడా స్థానం సంపాదించారు. వారి వివరాలు చూస్తే.
24) పవన్‌ కల్యాణ్‌ (రూ.31.33 కోట్లు)
28) ఎన్టీఆర్‌ (రూ.28 కోట్లు)
33) మహేశ్‌ బాబు (రూ.24.33 కోట్లు)
36) నాగార్జున (రూ.22.25 కోట్లు)
39) కొరటాల శివ (రూ.20 కోట్లు)
64) అల్లు అర్జున్‌ (రూ.15.67 కోట్లు)
72) రామ్‌చరణ్‌ (రూ.14 కోట్లు)
72) విజయ్‌ దేవరకొండ (రూ.14 కోట్లు)