ఫోర్బ్స్‌ జాబితాలో సింధుకు స్థానం

SINDHU
SINDHU

న్యూఢిల్లీ :భారత స్టార్‌ షట్లర్‌ పివి సింధు ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకుంది. తాజాగా ఫోర్బ్స్‌ ప్రపంచంలో అత్యధికి మొత్తంలో సంపాదిస్తున్న క్రీడాకారిణుల జాబితాను ప్రకటించింది. ఇందులో పివి సింధు ఏడో స్థానంలో నిలిచింది. భారత్‌ నుంచి టాప్‌ 10లో నిలిచిన ఏకైక క్రీడాకారిణి సింధు కావడం విశేషం. అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.