ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధo

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం హైదరాబాద్ శివారు కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల నుంచి దాదాపు 13 వేల మంది ప్రతినిధులు విచ్చేస్తున్నారు. 2001లో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఈ నెల 27తో 17 ఏళ్లు పూర్తి చేసుకుని 18వ ఏట అడుగుపెడుతోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ ప్లీనరీని ఘనంగా నిర్వహించుకోవడానికి సిద్ధమైంది. 2014లో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌కి అధికార పార్టీగా ఇది నాలుగో ప్లీనరీ.