ప్ర‌జ‌ల సంక్షేమం దృష్ట్యా పొత్తు కొన‌సాగిస్తాంః ఉద్ధ‌వ్‌

uddhav thakre
uddhav thakre

ముంబయి: మహారాష్ట్రలోని భాజపా ప్రభుత్వంలో కొనసాగే అంశంపై శివసేన త‌మ పార్టీ అధికారిక పత్రిక ‘సామ్నా’లో స్పష్టతనిచ్చింది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వంతోనే కొనసాగుతామని తెలిపింది. ప్రభుత్వం నుంచి వైదొలుగుతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ ఈ విధంగా స్పందించింది. భాజపా ప్రభుత్వంలో కొనసాగే అంశంపై త్వరలో పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుందని ఇటీవల శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ ప్ర‌క‌టించ‌డంతో వీరి బంధానికి తెరపడినట్లు ఊహాగానాలు వినిపించాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు గడువు ఉన్నందున.. ప్రజల సంక్షేమం దృష్ట్యా పొత్తును కొనసాగిస్తూ ప్రభుత్వంలోనే ఉంటామని ఆ పార్టీ స్పష్టంచేసింది. మరోవైపు శుక్రవారం జరిగిన తొక్కిసలాట ఘటనపై కేంద్రం ప‌నితీరును దుయ్య‌బ‌ట్టింది. ముంబయి వాసులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకకుండా బుల్లెట్‌ రైలు ఏర్పాటు చేసి ఉపయోగం ఏమిటని సామ్నా సంపాద‌కీయంలో ప్రశ్నించింది.